TS Inter exam results 2019 on 18th స్పష్టతనిచ్చిన ఇంటర్‌ బోర్డు

TS Inter exam results 2019 on 18th స్పష్టతనిచ్చిన ఇంటర్‌ బోర్డు : తెలంగాణా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఈ నెల ఈ నెల 18న విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.  ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు కొనసాగిస్తుంది.  అయితే ఇంటర్ బోర్డు కార్యదర్శి ఏ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలుపుతూ ఫలితాల విడుదల సమయాన్ని మాత్రం తర్వాత తెలియజేస్తామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ ఫలితాల విడుదలలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 18 న TS Inter results 2019 విడుదల చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి అశోక్‌ సోమవారం వెల్లడించారు. ఏపీలో ఈ నెల 12నే ఇంటర్‌ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో రాష్ట్రంలో ఫలితాల విడుదలపై తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.

ఫలితాల ప్రాసెస్‌ పర్యవేక్షణ బాధ్యతలను జేఎన్‌టీయూ ఉన్నతాధికారికి బోర్డు అప్పగించింది. ఆ సమస్యల ప్రభావం ఫలితాల విడుదలపైనా పడింది. తెలంగాణ, ఏపీలో ఇంటర్‌ పరీక్షలు ఒకేసారి జరిగిన విషయం తెలిసిందే. కాగా, తెలంగాణలోనూ ఫలితాలు వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థి సంఘాలు సోమవారం బోర్డు వద్ద ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఆందోళనలకు తెరదించేందుకు బోర్డు చర్యలు చేపట్టింది.