Today TS Polycet 2019 Exam, results on 24

Today TS Polycet 2019 Exam, results on 24 : పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ పాలిసెట్‌ను మంగళవారం (16.04.2019) న నిర్వహించనున్నారు. రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణామండలి కార్యదర్శి బీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మంగళవారం నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్-2019)కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు తెలిపారు.

  • రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,06,380 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు
  •  రాష్ట్రంలో 320 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు
  • ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది
  •  పరీక్ష సమయానికి (11గంటలు) ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు

పరిక్ష కేంద్రాలు : 

గచ్చిబౌలి పరిసరాల్లో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గచ్చిబౌలి డివిజన్‌ మధురానగర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మణికొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నార్సింగిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కేంద్రాలు ఉన్నాయన్నారు.

ఈ నెల 24న TS POLYCET 2019 Results ని  విడుదల చేయనున్నారు.

తీసుకోవాల్సిన జాగర్తలు :

విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి హాల్‌టికెట్, హెచ్‌బి/2బి పెన్సిల్, బ్లూ/బ్లాక్‌ బాల్‌పెన్స్‌ తప్పా మరే ఇతర వస్తువులు తీసుకురావద్దని సూచించారు. పరీక్షకు సంబంధించి బుక్‌లెట్‌లో ఇచ్చిన సూచనలను విద్యార్థులు తప్పకుండా పాటించాలి. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పాలిసెట్ కోసం కేంద్రాలకు గంటన్నర ముందే విద్యార్థులు చేరుకోవాలని, గంటముందు నుంచే పరీక్షకేంద్రాల్లోకి అనుమతిస్తామని కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రానికి సులువుగా చేరుకోవడానికి, గుర్తించడానికి ప్రత్యేక యాప్‌ ‘పాలీసెట్‌ ఎగ్జామినేషన్‌ సెంటర్‌ లొకేటర్‌’ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దీన్ని గూగుల్‌ ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.