Free coaching for Muslim youth in Civil Services

Free coaching for Muslim youth in Civil Services : దేశవ్యాప్తంగా డిగ్రీ అర్హత కలిగిన ముస్లిం యువతకు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల కోసం హజ్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా ముంబయిలో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం  మే 7 వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీ స్టేట్‌ హజ్‌ కమిటీ కార్యనిర్వాహక అధికారి తాజుద్దీన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు www.hajcommittee.gov.in వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చని సూచించారు. బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయి, పట్నా, శ్రీనగర్‌ పట్టణాల్లో ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి ఉచిత శిక్షణకు ఎంపిక చేస్తారని తెలిపారు.