Certificate verification from 20th to Medical Dental PG Seats

Certificate verification from 20th to Medical Dental PG Seats : ప్రైవేటు వైద్యవిద్యా కళాశాలల్లోని పీజీ మెడికల్‌, డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు.. ధ్రువపత్రాల పరిశీలన, వెబ్‌ కౌన్సెలింగ్‌ తొలి విడత ప్రకటనను వరంగల్‌ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జారీచేసింది. యాజమాన్య కోటాలో పీజీ డిగ్రీ, డిప్లొమా సీట్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 20, 21 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. అభ్యర్థుల ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితాను ప్రకటించారు. వారు ఉస్మానియా విశ్వవిద్యాలయ క్యాంపస్‌, పీజీఆర్‌ఆర్‌సీడీఈ లోని పరిశీలన కేంద్రాల వద్ద నిర్ణీత తేదీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని రిజిస్ట్రార్‌ తెలిపారు.